: ఇలాచేస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది


రోజూ ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం. ఇలాంటి జీవితం గడిపేవారు రోజూ కాసేపు అలా ప్రశాంతంగా పచ్చని చెట్లమధ్య నడిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. రోజూ ఉరుకుల పరుగుల జీవనాన్ని గడిపేవారు త్వరలోనే అనారోగ్యానికి గురవుతుంటారు. వీరికి రకరకాల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటికి పచ్చని చెట్ల మధ్య కాసేపు నడిస్తే అదే మంచి విరుగుడుగా పనిచేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.

లండన్‌కు చెందిన పరిశోధకులు మనసుకు హాయిని కలిగించేలా ఉండే పచ్చని పరిసరాల్లో కాసేపు నడవడం మంచిదని, ఈ నడక మన గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకు చక్కటి మందులాగా పనిచేస్తుందని అంటున్నారు. మన చుట్టూవున్న ప్రకృతిలో మన అనారోగ్యాన్ని తగ్గించే ఒక మహత్తర గుణంవుంది. మనలోని పలు రకాలైన ఒత్తిడులను తగ్గించే శక్తి మన చుట్టూవున్న ప్రకృతిలో దాగివుంది. రోజూ పగలంతా కార్యాలయాల్లో పనిఒత్తిడితో సతమతమయ్యేవారు కాసేపు ఈ ఒత్తిడినుండి సాంత్వన పొందాలంటే వేరేమీ చేయకుండా ప్రకృతిపై భారంవేసి పచ్చని పరిసరాల్లో నడుస్తూవుంటే చాలు. ఇక వారి మనసుకు చక్కటి సాంత్వన చేకూరుతుందని ఈ పరిశోధకుల బృందానికి సారథ్యం వహించిన గ్లాడ్‌వెల్‌ చెబుతున్నారు. ఇలా పచ్చని పరిసరాల్లో నడవడం వల్ల మనలోని శారీరక, మానసికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని గ్లాడ్‌వెల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News