: ఏకాగ్రతకు కారణం ఇదే


కొందరు ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే దాన్ని ఇట్టే నేర్చుకుంటారు. మరికొందరు ఎన్నిరోజులు నేర్చుకున్నా దానిపై సరైన పట్టు సాధించలేరు. అయితే ఇలా జరగడానికి కారణం ఏకాగ్రత. మనం నేర్చుకునే అంశంపై మనకుండే ఏకాగ్రత వల్లే మనం ఏదైనా ఇట్టే సులభంగా నేర్చుకోగలం. అయితే ఇంతకాలం ఈ ఏకాగ్రతకు సంబంధించిన విషయం రహస్యంగానే ఉండిపోయింది. కొందరికి మాత్రం కొన్ని విషయాలపైనే ఏకాగ్రత ఉండడం, ఇంకొందరికి సరైన ఏకాగ్రత లేకపోవడానికి కారణం ఏమనేది తెలియకుండా ఉండిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన గుట్టును శాస్త్రవేత్తలు గుర్తించేశారు.

మనం మనకు కావలసిన విషయంపై ఏకాగ్రతను నిలపడానికి, ఇతర విషయాలపై అంతగా ఏకాగ్రత చూపలేకపోవడానికి కారణం మన మెదడే. ఇలా మనకు అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా చేసే సామర్ధ్యం మన మెదడుకు ఉంది. అయితే దీనివెనుకున్న అసలు గుట్టు ఏమనేది ఇంతవరకూ శాస్త్రవేత్తలకు అంతుబట్టకుండా ఉండేది. ఇప్పుడు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఇలా మెదడుకు సంబంధించిన ఈ గుట్టును గుర్తించారు. ఇలా మెదడు కేవలం కొన్ని విషయాలపై ఏకాగ్రత చూపడానికి కారణం మెదడులోని కొన్ని ప్రత్యేక కణ యంత్రాంగాలు. వీటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కణ యంత్రాంగాల కారణంగా మన మెదడు మనకు కావలసిన అంశంపై ఏకాగ్రతను నిలుపుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News