: జెట్-ఎతిహాద్ ఒప్పందానికి లైన్ క్లియర్


భారత్ కు సంబంధించిన జెట్ ఎయిర్ వేస్ లో అబూదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్ వేస్ పెట్టుబడులకు లైన్ క్లియరైంది. ఈ ఒప్పందానికి ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం 2,058 కోట్ల రూపాయలు జెట్ ఎయిర్ వేస్ లో పెట్టుబడి పెట్టి ఎతిహాద్ ఎయిర్ వేస్ 24 శాతం వాటా పొందనుంది. దీంతో, ఎతిహాద్ ఎయిర్ లైన్స్ నుంచి ఇద్దరు డైరెక్టర్లు, జెట్ ఎయిర్ వేస్ నుంచి నలుగురు డైరెక్టర్లతో బోర్డు ఏర్పాటు చేస్తారు. ఈ ఒప్పందం ఇప్పుడు ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ ముందుకు వెళ్లనుంది.

  • Loading...

More Telugu News