: కొత్త బస్సుకు రూపకల్పన చేసిన ఇస్రో, టాటా మోటార్స్
భారత అంతరిక్ష కార్యక్రమాలను పర్యవేక్షించే ఇస్రో, ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తో చేతులు కలిపింది. ఈ సంయుక్త ప్రాజెక్టులో భాగంగా, ఇంధన వినియోగ పరంగా అత్యంత సమర్థవంతంగా పరుగులు తీసే ఓ హైబ్రిడ్ బస్సు రూపుదిద్దుకుంది. గతకొన్నేళ్ళుగా పరిశోధనలు జరుపుతున్న ఈ రెండు సంస్థలు హైడ్రోజన్ ఇంధనంగా పనిచేసే అధునాతన ఇంజిన్ ను తయారు చేశాయి. తాజా పరిజ్ఞానం ప్రకారం ఇంధనాన్ని సిలిండర్లలో అధిక పీడనం వద్ద నింపి బస్సు పైభాగంలో నిక్షిప్తం చేస్తారు. అయితే, బస్సు టాప్ పై జీరో పొల్యూషన్ ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. భవిష్యత్ రవాణా రంగంలో ఇలాంటి బస్సులదే ప్రముఖ పాత్ర అని ఇస్రో అధికారులు అంటున్నారు.