: తెలంగాణ ప్రజలకు అజిత్ సింగ్ శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అజిత్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ పోరాటం చేసిన తెలంగాణ ప్రజలకు కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణతో పాటు చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమని ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ముందుకురావడం సంతోషకరమన్నారు. అయితే, తెలంగాణ ఏర్పాటు ఏ రూపంలో ఉంటుందునేది రేపటి సమన్వయ కమిటీ భేటీలో తెలుస్తుందని అజిత్ సింగ్ ఢిల్లీలో చెప్పారు.