: సీఎం కిరణ్ కు చంద్రబాబు లేఖ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు లేఖాస్త్రం సంధించారు. వర్షాలతో ప్రాజెక్టుల్లో భారీగా నీరు వచ్చి చేరినా, సర్కారు సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకునేందుకు జాప్యం చేస్తోందని బాబు తన లేఖలో ఆరోపించారు. నాగార్జున సాగర్ నుంచి వెంటనే నీటిని దిగువకు విడుదల చేయాలని, లేకపోతే డెల్టా ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోతారని బాబు వివరించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెడన, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్నం, కైకలూరు నియోజకవర్గాల్లో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారని బాబు తెలిపారు. కృష్ణా జిల్లా తూర్పు కాలువకు 13 వేల క్యూసెక్కుల నీరు అవసరం ఉండగా, 300 క్యూసెక్కులే విడుదల చేస్తున్నారని ఆరోపించారు.