: మోడీకి రాఖీ పంపిన ముస్లిం యువతులు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వారణాసికి చెందిన ముస్లిం యువతులు రాఖీ పంపారు. దేశాన్ని ఓ మంచి నేత పాలించాలనే ఉద్దేశంతో, సోదరభావంతో తాము స్వంతంగా రూపొందించిన పెద్ద రాఖీని మోడీకి పంపినట్లు తెలిపారు. త్వరలోనే రాఖీ మోడీ వద్దకు చేరనుంది. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మోడీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారణాసిలోని లల్లాపూర్ లో ముస్లిం యువతులు ఓ ప్రార్ధనను నిర్వహించారు. మోడీ ఓ చరిష్మాటిక్ నేత అని అభివర్ణించారు. దేశాన్ని ముందుండి నడిపించే నేతగా నరేంద్ర మోడీని చూడాలనుకుంటున్నట్లు వారు తెలిపారు.