: అధికారంలోకి రాగానే రాయల జిల్లాలను వదిలించుకుంటాం: నాగం
రాయల తెలంగాణ ప్రతిపాదనపై బీజేపీ నేత నాగం జనార్ధనరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము అధికార పీఠమెక్కగానే తెలంగాణలో కలిపే ఆ రెండు రాయలసీమ జిల్లాలను పంపేస్తామన్నారు. ఎన్డీఏ తెలంగాణ ఇవ్వలేదన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల్ని ఖండించిన నాగం, అప్పట్లో తెలంగాణకు చంద్రబాబు అడ్డుగా నిలిచారన్నారు. ఇప్పడు తెలంగాణ పేరుతో కాంగ్రెస్ విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఎవరి మనోభావాలు గౌరవించేందుకు రాయల తెలంగాణ అంటున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి భయపడే కాంగ్రెస్ తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టిందని నాగం విమర్శించారు.