: బంగారం దిగుమతులు పెరిగాయి: చిదంబరం
ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న భారత్ లో జులై నెలలో దిగుమతులు భారీగా పెరిగాయని ఆర్ధికమంత్రి పి.చిదంబరం తెలిపారు. ఇది గత నెల దిగుమతుల కంటే ఎక్కువని చెప్పారు. జూన్ లో 31.5 టన్నుల పసిడి దిగుమతి అయినట్టు తెలిపారు. దిగుమతులు తగ్గించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ జులైలో పెరిగాయని ముంబయిలో అన్నారు. అయితే, టన్నులలో పెరిగిందా? లేక విలువపరంగానా? అనే దానిపై చిదంబరం సమాధానం ఇవ్వలేదు.