: ప్రేయసి కోసం బ్రాడ్ పిట్ భారీ కానుక


హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ స్వంతంగా ప్రైవేట్ జెట్ విమానం కొంటున్నాడు. దీనిని తన ప్రియురాలు ఏంజెలీనా జోలీ కోసం కొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇష్టమైన విమానాన్ని ఎంపిక చేసుకుంటే, డబ్బులు తానే ఇస్తానని బ్రాడ్.. జోలీకి ఆఫర్ ఇచ్చాడట. ఈ ఆఫర్ తో జోలీ తెగ సంతోషంలో మునిగిపోయింది. విమానాలు నడపడాన్ని బాగా ఇష్టపడే ఏంజెలీనా 2004లోనే పైలెట్ శిక్షణ తీసుకుని, లైసెన్స్ కూడా పొందింది. అందుకే, ఆమెకు భారీ విమానాన్ని కానుకగా ఇవ్వాలని బ్రాడ్ నిర్ణయించుకున్నాడట. విమానం కొన్న తర్వాత సముద్రాలన్నింటినీ చుట్టి రావాలని ఈ నీలికళ్ళ సుందరికి కోరికగా ఉందట. ఇంకేం, శీఘ్రమేవ అభీష్ట సిద్ధిరస్తు!

  • Loading...

More Telugu News