: చంద్రబాబు ఓ శిఖండి: హరీశ్ రావు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణకు అడ్డుపడుతోంది బాబేనంటూ ఆయననను శిఖండితో పోల్చారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలంలో హరీశ్ మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్బంగా నేడు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం స్వప్నం సాకారమవుతున్న తరుణంలో బాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

బాబు తీరు ఎప్పుడూ ఇంతేనని ఆయన మండిపడ్డారు. గతంలోనూ సీమాంధ్ర నేతల రాజీనామాలతో తెలంగాణను అడ్డుకున్నారని విమర్శించారు. తాజాగా, ములాయం సింగ్ యాదవ్ తో కలిసి కొత్త కుట్రకు తెరదీశారని వివరించారు. తాము తెలంగాణకు వ్యతిరేకమని ములాయం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News