: కాంగ్రెస్ లీకులిస్తోంది: వెంకయ్య నాయడు


తనకు ఏది లాభమో, ఏది నష్టమో తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ లీకులిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతోందని ఆరోపించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, కేంద్రం వైఖరి స్పష్టమైన తరువాత స్పందిస్తామన్నారు. పార్లమెంటులో ఏ రకమైన బిల్లు పెడతారనే దానిపై కాంగ్రెస్ నోరు విప్పడం లేదని, బిల్లు రూపురేఖలు పరిశీలించిన తరువాతే మద్దతుపై ఆలోచిస్తామని తెలిపారు. అయితే, తెలంగాణపై తమ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News