: 100 కోట్లకు రాజ్యసభ ఎంపీ పదవి: కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు


దేశ ప్రజాస్వామ్యం ఎటు వైపు వెళుతుందో తెలియజేసేలా కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు బీరేందర్ సింగ్ ఎగువసభలో బెర్త్ 100 కోట్ల రూపాయలంటూ వ్యాఖ్యానించారు. 'రాజ్యసభ ఎంపీ పదవి పొందాలంటే 100 కోట్ల రూపాయలు అవసరమని ఒకానొక వ్యక్తి నాకోసారి చెప్పారు. కానీ ఆయన 80 కోట్ల రూపాయలకే సొంతం చేసుకుని, 20 కోట్ల రూపాయలను పొదుపు చేసుకున్నారు' అంటూ బీరేందర్ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనంతకుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను నీచస్థితికి దిగజారుస్తోందని మండి పడ్డారు. ఇలాంటి లావాదేవీలు కాంగ్రెస్ కు అలవాటేనని విమర్శించారు. బీరేందర్ సింగ్ ఇటీవలి వరకూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News