: ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి ఓట్ల లెక్కింపు నిలిపివేత


ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్ష పదవి ఎంపిక వాయిదా పడింది. మండలికి చెందిన పలు సెక్టార్ల ఎన్నికలు నిన్న(ఆదివారం) హైదరాబాదులో జరిగాయి. ఇందులో డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ కు జరిగిన ఎన్నికల తీరులో అవకతవకలు ఉన్నాయంటూ చిన్న నిర్మాతల సంఘం నాయకుడు నట్టికుమార్ ఈ నెల 16న కేసు దాఖలు చేశారు. ఈ విషయం సిటీ సివిల్ కోర్టు దాకా వెళ్లడంతో ఆ సెక్టార్ ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు ఒకటి వరకు లెక్కింపు చేయరాదని కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ కు లభించింది. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి ఓట్ల లెక్కింపును కూడా నిలిపివేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News