: హైదరాబాద్ కు ఢిల్లీ పొలీసులు
ఉగ్ర పేలుళ్ల దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు కూడా పాలుపంచుకోబోతున్నారు. గురువారం సాయంత్రం దిల్ సుఖ్ నగర్లో జరిగిన బాంబు పేలుళ్లు ఇండియన్ ముజాహుదీన్ పనిగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు గతేడాది అక్టోబర్లో అరెస్ట్ చేసిన ఇండియన్ ముజాహుదీన్ అనుమానిత ఉగ్రవాది మక్భూల్ భట్ నుంచి తెలుసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్ కు వస్తోంది.