: సీడబ్ల్యూసీ అజెండా నాకు తెలియదు: దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అజెండా ఏమిటో తనకు తెలియదని ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. అజెండా గురించి చెప్పడానికి తానేమీ యూపీఏ సమన్వయ సభ్యుడిని కానన్నారు. అయితే, పంచాయతీ ఎన్నికలకు తెలంగాణపై ప్రకటనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, తెలంగాణ అంశంపై విస్తృత సంప్రదింపులు జరిపామని చెప్పారు. కాగా, రేపు మధ్యాహ్నం కోర్ కమిటీ సమావేశం అనంతరం ఐదున్నరకు జరగనున్న ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.