: హస్తినకు సీఎం, పీసీసీ చీఫ్ లకు ఆహ్వానం


తెలంగాణ అంశంపై కీలక ప్రకటన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నందున సీఎం, పీసీసీ అధ్యక్షుడ్ని ఢిల్లీ రమ్మని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. రేపు జరుగనున్న సీడబ్ల్యూసీ భేటీ అనంతరం రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రత్యేక ప్రకటన చేయనుందని స్పష్టమైన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వీరి హస్తిన ఆహ్వానం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామంటున్న కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సలను పిలిచి వారి సమక్షంలోనే రాష్ట్ర ప్రకటన చేస్తే, ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి కలిగే నష్టాన్ని నివారించవచ్చన్నది కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News