: మూడువేల కిలోమీటర్లకు చేరిన షర్మిల పాదయాత్ర
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' మూడువేల కిలోమీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని ధనపురంలో ఆమె యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ చిత్ర పటానికి షర్మిల నివాళులు అర్పించారు.