: తెలంగాణను వ్యతిరేకిస్తాం: ములాయం


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నిన్న బెంగళూరుకు వచ్చిన సందర్భంగా తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడారు. ఇలా రాష్ట్రాలను ముక్కలు చేసుకుంటూ పోతే దేశం విచ్ఛిన్నం అవుతుందని హెచ్చరించారు. తెలంగాణను అంగీకరించబోమని, పార్లమెంటులో బిల్లు పెడితే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. చేతనైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అభివృద్ధి సాధ్యమనే వాదనను తోసిపుచ్చారు. ''ఎన్డీయే హయాంలో ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల పరిస్థితి చూస్తునే ఉన్నాం. ఏమంత బాలేదు. రేపు తెలంగాణ పరిస్థితి కూడా వీటిలానే కాదనే గ్యారంటీ ఏముంది?'' అంటూ ములాయం ప్రశ్నించారు. ప్రస్తుతమున్న రాష్ట్రాలను యథావిధిగానే కొనసాగించి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News