: మారు పేర్లతో ఉగ్రవాదుల మకాం


రక్తపాతం సృష్టించడానికి ఉగ్రవాదులు పక్కా పథకంతో వ్యవహరించారని తెలుస్తోంది. మారు పేర్లతో ముష్కరులు దిల్ సుఖ్ నగర్లోని ఓ లాడ్జిలో మకాం వేసి, తమ పథకాన్ని అమలు చేసినట్లు సమాచారం. అదే సమయంలో దిల్ సుఖ్ నగర్ చౌరస్తాలో సీసీ కెమేరాలు ఉన్నప్పటికీ, అవి పనిచేయకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. కొన్ని రోజుల ముందే పనిచేయకుండా కెమేరాల వైర్లను తెంపినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగు చూడవచ్చు.

హైదరాబాద్ నగరాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంతో ఆరేడేళ్ల క్రితమే లాడ్జిలు, హోటళ్ల విషయంలో పోలీసు శాఖ కఠిన నిబంధనలను అమలులో్కి తీసుకొచ్చింది. బస చేసే వారి నుంచి చిరునామా ధ్రువీకరణ, వారి ఫోటోను అప్పటికప్పుడు కెమేరాతో చిత్రీకరించాలని నిబంధనలను విధించింది.

అలాగే లాడ్జిల లోపల కారిడార్లలోనూ కెమేరాలు పెట్టాలని ఆదేశించింది. కానీ, పర్యవేక్షణ లేకపోవడంతో పెద్దగా అమలు కావడం లేదు. లాడ్డిలలో మకాం వేసిన వారి చిత్రాలను తీసుకుని ఉంటే ఇలాంటి దుర్ఘటనలు జరినప్పుడు నిందితులను పట్టుకోవడానికి వీలవుతుంది. 

  • Loading...

More Telugu News