: పక్షే కానీ...!


చూడ్డానికి అది పక్షిలాగే ఉంటుంది. కానీ అన్ని పక్షులలాగా ఎగరలేదు. ఇలాంటి ఒక సరికొత్త పక్షిని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనకు తెలిసినంతవరకూ ఎగరలేని పక్షులు ఏవి అంటే కోడి, నిప్పుకోడి, బాతు అని చెబుతాం. అయితే ఇవేకాకుండా ఈ కొత్త పక్షిని కూడా ఈ వర్గంలో చేర్చవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత జంతుశాస్త్ర అధ్యయన సంస్థ (జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) వారు ఈ ఎగరలేని పక్షిని ఆవిష్కరించారు.

భారతదేశానికి సంబంధించిన గ్రేట్‌ నికోబార్‌ దీవుల్లో శాస్త్రవేత్తలకు ఒక సరికొత్త పక్షి కనిపించింది. ఇది ఎగరలేకుండా ఉంది. అరుదైన పక్షి జాతులకు సంబంధించినదిగా భావిస్తున్న శాస్త్రవేత్తలు ఈ పక్షికి ఇంకా నామకరణం చేయలేదు. ఈ పక్షి గురించి భారత జంతుశాస్త్ర అధ్యయన సంస్థ సంచాలకుడు కె.వెంకటరామన్‌ మాట్లాడుతూ 2012కి సంబంధించి తమ ఆవిష్కరణల్లో ఈ పక్షి అత్యంత విశిష్టమైందని చెబుతున్నారు. ఈ పక్షి 'రాలినా క్రేక్‌' వర్గానికి చెందినది కావచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ పక్షితోబాటు ఇంకా అరుదైనవిగా భావిస్తున్న సుమారు 133 రకాలకు చెందిన జీవజాతులను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీటిలో రెండుజాతుల ఉభయచరాలు, 19 రకాల చేపలు, రెండు రకాల సరీసృపాలు, రెండు పీతల రకాలు, నాలుగు సాలెపురుగు జాతులు, 66 రకాల కీటకాలతోబాటు అనేకరకాలకు చెందిన సూక్ష్మాణు జీవులను కూడా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఆష్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఈశాన్య ఆసియా, ఎర్రసముద్రం, ఇండో`పసిఫిక్‌ ప్రాంతానికి పరిమితమైన 42 ముత్యపురకాలను కూడా భారతదేశంలోని సముద్రంలో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News