: భారత్‌లో అత్యధికం గుండెజబ్బు మరణాలే
గుండెజబ్బులు అనేవి భారతీయుల్లో నెంబర్ వన్ హంతకవ్యాధులుగా పరిణమిస్తున్నాయని తాజాగా ఒక అధ్యయనం చెబుతోంది. భారతీయ రిజిస్ట్రార్ జనరల్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి వారు సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది. 25 నుంచి 69 ఏళ్ల మధ్యగల వయసు వారిలో 25 శాతం మరణాలు కేవలం గుండెజబ్బుల కారణంగా సంభవిస్తున్నాయని ఈ సర్వే తేల్చింది. అన్ని వయో వర్గాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం మరణాల్లో గుండె జబ్బులు అనేవి 19 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి.
పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృద్రోగుల్లో 60 శాతం మంది భారత్‌లోనే ఉంటున్నారనేది కూడా ఈ అధ్యయనం అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అంచనాల ప్రకారం కూడా.. 2014 నాటికి 20 మిలియన్‌ల మంది గుండెజబ్బులతో చనిపోతారనేది ఒక అంచనా కాగా, వారిలో భారతీయ ఉపఖండం నుంచే అత్యధికులు ఉంటారని తేలుస్తున్నారు. గుండెపోటు రావడంలో దాదాపు సగం కేసులు 50 ఏళ్ల కంటె తక్కువ వయసులోను, 40 ఏళ్ల కంటె తక్కువ వయసులో 25 శాతం కేసులు వెలుగు చూస్తున్నాయిట.