: మందుకొట్టే ఎఫెక్టులో ఆడామగా తేడాలుంటాయ్‌


ఆడా మగా వ్యత్యాసాలు సామాజికం మాత్రమే కాదు.. ఇంకా రకరకాల రూపాల్లోనూ ఉంటాయి. సప్పోజ్‌.. ఆల్కహాలు పుచ్చుకుంటే ఉండే ప్రభావంలో కూడా ఆడా మగా మధ్య తేడాలుంటాయి. అంటే ఒక పెగ్గు పుచ్చుకోవడం అనేది కొలబద్ధ అయితే దాని ప్రభావం శ్రీవారి మీద శ్రీమతి మీద వేర్వేరుగా ఉంటుందన్నమాట. వెర్మాంట్‌ యూనివర్సిటీకి చెందిన వాలెరీ ఎస్‌ హార్డర్‌ ఈ విషయంలో సుదీర్ఘ అధ్యయనం చేసి నిగ్గు తేల్చిన సత్యం ఇది.

లిక్కరు పుచ్చుకోవడంలో ఉండే ప్రభావం.. మరురోజు వారి మీద ఉండే ప్రభావం దృష్ట్యా ఈ తేడాలు కనిపిస్తాయిట. మగాళ్లు కోపం వచ్చినప్పుడు ఎక్కువ తాగుతారట. ఆనందం లేదా దు:ఖం లిక్కర్‌వైపు నడిపించడం అనేది ఆడామగాలో వేర్వేరుగా ఉంటుందిట. కొంత మంది తమ మూడ్‌ పెంచుకోవడానికి తాగుతున్నట్లు చెబుతారు గానీ.. వాస్తవంలో అలా జరగడం లేదు అని హార్డర్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News