: పశువులకు ఎక్కువ సాలీడు కంటె తక్కువ
ఇది ఒక రోబోనే! కానీ పశువల కంటె కాస్త ఎక్కువ.. సాలె పురుగు కంటె కాస్త తక్కువ. ఇదేంటి వింతగా అనుకుంటున్నారా? దాని కాళ్ల లెక్క ప్రకారం పోలిక అంతే. ఎందుకంటే ఈ రోబో ఆరు కాళ్ల మీద పనిచేస్తుంది. పశువులకు నాలుగు కాళ్లుంటాయి. సాలీడుకు 8 కాళ్లుంటాయి. కానీ ఈ రోబోకు ఆరు కాళ్లుంటాయి.
పరుగెత్తడం, పల్టీలు కొట్టడం లాంటి చమక్కులు తెలిసిన రోబోను పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా రూపొందించారు. ఇతర రోబోలతో పోలిస్తే దీని పనితీరు చాలా ఘనంగా ఉందన్నారు. తన కంటె ఎత్తున్న వస్తువులను కూడా ఇది ఎగిరి గంతేసి దాటేస్తుందిట. అంటే రన్నింగే కాదు, హైజంప్ కూడా అన్నమాట. ఇంతకూ దీని పేరేంటో తెలుసా? హెక్స్. ఆరుకాళ్లకు సరిపోయినట్లే ఉందిగా...?