: బైరెడ్డీ ...నీ ముక్కూ చెవులూ కోస్తాం: ఎంపీ పొన్నం
సోనియా గాంధీపై విమర్శలు చేస్తున్న రాయలసీమ నాయకుడి ముక్కు, చెవులు కోసేస్తామని తెలంగాణ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ బైరెడ్డి విమర్శలు చేస్తుంటే రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు స్పందించడం లేదని మండిపడ్డారు. బైరెడ్డి కల్లుతాగిన కోతిలా మాట్లాడితే ఊరుకోడానికి తాము సీమాంధ్ర నేతలం కాదని అన్నారు. తెలంగాణ ప్రజలు రాయలసీమ జిల్లాలను కలుపుకోవాలని ఎప్పడూ అనుకోలేదన్నది గుర్తించాలన్నారు. తెలంగాణ కోసం వెయ్యిమంది బలిదానం చేసుకుంటే రాష్ట్ర ఏర్పాటును రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న సమయంలో అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని తెలిపారు.