: తెలంగాణలో కొత్త యాక్షన్ ఫ్రంట్ ఏర్పాటు
ప్రత్యేక తెలంగాణ సాధనకు తెలంగాణ యాక్షన్ ఫ్రంట్ పేరిట మరో సంస్థ ఏర్పాటైంది. ఉద్యమ పరిరక్షణ, తెలంగాణ పునర్నిర్మాణంపై ఉద్యమ సంఘాలు, పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. సుమారు 50 ఉద్యమ సంఘాల ప్రతినిధులు సమావేశమై పలు కీలక అంశాల గురించి చర్చించారు. రాష్ట్ర ఏర్పాటు అంకం తుదిదశకు చేరుకుంటున్న తరుణంలో మరింత ఒత్తిడి పెంచాలని, పార్లమెంటు తీర్మానం అనంతరం రాష్ట్రపతి సంతకం చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని తీర్మానించారు. సామాజిక న్యాయం, రాజధాని విషయాలపై గందరగోళం నెలకొనకుండా కాంగ్రెస్ కు హెచ్చరిక చేయాలని సమావేశంలో తీర్మానించారు.