: టీడీపీ కాంగ్రెస్ సిగపట్లు.. ఐదుగురికి గాయాలు
గుంటూరు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.