: తెలంగాణ మరో ఛత్తీస్ గఢ్ గా మారుతుంది: మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్


తెలంగాణ విభజిస్తే మరో ఛత్తీస్ గఢ్ ను కేంద్రమే సృష్టించినట్టవుతుందని మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ హెచ్చరించారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల సమస్యను పరిష్కరించిన తరువాత తెలంగాణ విభజన గురించి ఆలోచించడం మంచిదని సలహా ఇచ్చారు. అలా కాకుండా ఇప్పుడే విభజన జరిగితే మావోయిస్టులు పేట్రేగిపోయే అవకాశముందని అన్నారు. ఛత్తీస్ గఢ్ మావోలు దాక్కునేందుకు అనువైన ప్రాంతాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని, అంతేకాకుండా మావోల వాదనలకు, ప్రసంగాలకు యువకులు తొందరగా భావోద్వేగాలకు లోనయ్యే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News