: సినిమాలలో జంతువులుంటే అనుమతులిక కష్టం


సినిమాలలో జంతువులను చూపించకూడదన్న నిబంధనలను నిర్మాతలు తెలివిగా ఉల్లంఘిస్తుండడంతో.. వారికి చెక్ పెట్టడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. సింహాలు, పులులు, కోతులు, అడవి దున్నలు సహా మరికొన్ని జంతువులను చిత్రీకరించడం నిషిద్ధం. అంతేకాదు, వీటికి కఠినమైన శిక్షణ ఇవ్వడం, సర్కస్ లాంటి ప్రదర్శనలు నిర్వహించడం కూడా నిషేధమే. అయితే, తెలివైన నిర్మాతలు.. నిబంధనలు అనుమతించే దేశాలకు వెళ్లి జంతువులతో సన్నివేశాలను పూర్తి చేసుకుని వచ్చి ఇక్కడ సెన్సార్ బోర్డు అనుమతి పొందుతున్నారు. అదేమంటే తాము భారత్ లో జంతువులను చిత్రీకరించలేదని వాదన వినిపిస్తున్నారు. వాస్తవానికి జంతువులున్న సినిమాలకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వాలంటే భారత జంతు సంరక్షణ మండలి నుంచి నిరభ్యంతర పత్రాన్ని నిర్మాతలు తెచ్చుకోవాలి. ఇన్ని నిబంధనలు ఉన్నా నిర్మాతలు మాత్రం ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీంతో జంతువుల హక్కుల ఉద్యమకారులు కేంద్ర మంత్రి మనీష్ తివారీకి పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో నిర్మాతల ఆటలు కట్టించేలా నిబంధనలను కట్టుదిట్టం చేయాలని సమచార ప్రసార శాఖ నడుం బిగించింది. ఇప్పటికే న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా కోరింది.

  • Loading...

More Telugu News