: కోహ్లీ గేమ్ ప్లాన్.. టీమిండియా ఫీల్డింగ్
జింబాబ్వే టూర్ లో టీమిండియా సిరీస్ ను నేడే తేల్చేసేందుకు సిద్దమవుతోంది. హరారే వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత జట్టు జింబాబ్వేకు బ్యాటింగ్ అప్పగించింది. జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమింతం చేసి సిరీస్ ను గెలవాలన్నది కోహ్లీ గేమ్ ప్లాన్ గా కనబడుతోంది. అయితే మ్యాచ్ మ్యాచ్ కూ పసికూన జింబాబ్వే రాటుదేలుతోంది. అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. గెలుపోటముల సంగతలా ఉంచితే జట్టుగా జింబాబ్వే ఆకట్టుకుంటోంది. తమ పరిధిలో రాణిస్తూ ఆటగాళ్లంతా భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నారు. సమష్టిగా ఆడుతూ టీమిండియాకు పోటీనిస్తున్నారు.
కోహ్లీ మాత్రం ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నాడు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ స్వంతం చేసుకుని మిగిలిన మ్యాచ్ లలో ప్రయోగాలు చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. కోహ్లీలోని కెప్టన్ దూకుడుగా ప్రణాళికలు రచిస్తూ టీమిండియా రిజర్వ్ బెంచ్ ను పటిష్ఠం చేస్తున్నాడు.