: పంచాయతీల్లో జెండా పాతిన కాంగ్రెస్


రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. దీంతో రెండు విడతలు కలిపితే కాంగ్రెస్ దే పైచేయి. రెండో విడతలో కాంగ్రెస్ మద్దతు దారులు 2,302 పంచాయతీల్లో గెలిస్తే, టీడీపీ 2,202 పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసింది. వైఎస్సార్సీపీ 1,301 పంచాయతీలను చేజిక్కించుకోగా, టీఆర్ఎస్ 589 పంచాయతీలను స్వంతం చేసుకుంది. వామపక్షాలు 133 పంచాయతీల్లో విజయం సాధించి ఉనికిని చాటుకున్నాయి. కాగా, ఇండిపెండెంట్లు 1002 పంచాయతీల్లో గెలిచి పార్టీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాటాయి. 11 జిల్లాల్లో కాంగ్రెస్ సత్తా చాటగా, 8 జిల్లాల్లో టీడీపీ అగ్రస్ధానంలో నిలిచింది.

రంగారెడ్డి జిల్లాలో రెండు పార్టీలు చెరో 70 స్థానాలు సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచి తనకు ఆదరణ తగ్గలేదని నిరూపించుకుంది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ గల్లంతైంది. కాగా, తెలంగాణ జిల్లాల్లో రెండోస్థానానికి పరిమితమైంది టీఆర్ఎస్. సీమలో రెండు జిల్లాల్లో అగ్రస్థానంలో నిలిచి వైఎస్సార్ సీపీ తన పట్టు నిరూపించుకుంది.

  • Loading...

More Telugu News