: ఉత్కంఠ పోరులో పాక్ దే పైచేయి


నరాలు తెగే ఉత్కంఠ పోరులో చివరి బంతికి పాక్ విండీస్ ను మట్టి కరిపించింది. వెస్టిండీస్ టూర్ లో కింగ్ స్టన్ లో జరిగిన తొలి టీట్వంటీలో అరంగేట్రం చేసిన 34 ఏళ్ల జుల్ఫికర్ బాబర్ చివరి బంతికి సిక్సర్ బాది పాకిస్థాన్ కు విజయం అందించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ మెన్ లో పొలార్డ్(49), స్యామీ(30), శామ్యూల్స్(25), బ్రావో(25) రాణించగా, జుల్ఫికర్(3), హఫీజ్(2) విండీస్ ను కట్టడి చేశారు.

అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ ఇంకో బంతి మిగిలుండగా స్కోరు సమం చేసింది. దీంతో చివరి బంతికి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఆ బంతిని జుల్ఫికర్ సిక్సర్ బాదడంతో పాక్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. పాక్ జట్టులో అఫ్రిది(46), అమీన్(47) రాణించారు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా అఫ్రిది నిలిచాడు.

  • Loading...

More Telugu News