: సిరీస్ భారత్ దే!


జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్ లో కీలకమైన మూడో మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. మొదటి రెండు వన్డేలు జరిగిన హరారేలోనే మూడో వన్డే కూడా నేటి మధ్యాహ్నం 12.30గంటల నుంచి ప్రారంభం కానుంది. మొదటి రెండు వన్డేలను సొంతం చేసుకున్న భారత జట్టు నేడు జరగనున్న మూడో వన్డేను కూడా గెలుచుకుని సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అలా జరిగితే... చివరి రెండు వన్డేలలో ఇతర ప్లేయర్లతో ప్రయోగాలు చేయడానికి అవకాశం దక్కుతుంది. కానీ, మూడో వన్డేలో ఓడిపోతే జింబాబ్వే సిరీస్ ను కోల్పోతుంది. అందుకే, ఎలాగైనా ఈ మ్యాచ్ ను గెలిచితీరాలన్నది జింబాబ్వే జట్టు యోచనగా ఉంది. అయితే, ఇది అనుకున్నంత సులువు కాదు. ప్రధానంగా జింబాబ్వే జట్టు బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. దీంతో ఈ వన్డే, సిరీస్ భారత్ దేనని తెలుస్తొంది.

  • Loading...

More Telugu News