: న్యాయవిజయం.. అమెరికాలోకి నాట్కో మందులు
భారత్‌లో వైద్యరంగంలో ప్రసిద్ధ సంస్థల్లో ఒకటైన నాట్కో తాము ఉత్పత్తి చేసే మందులను అమెరికన్ మార్కెట్‌లో విక్రయించే విషయంలో న్యాయపరమైన విజయం సాధించింది. ఎంతో కీలకమైన ఈ మందులు వచ్చే ఏడాదినుంచి అమెరికన్ మార్కెట్‌లోకి ప్రవేశించనున్నాయి. నరాల వ్యాధికి సంబంధించిన ఒక కీలక ఔషధం విషయంలో.. హైదరాబాదు కేంద్రంగా ఉన్న నాట్కో సంస్థ విజయం సాధించింది.
నాడీ శాఖల మీద తొడుగు క్షీణించినందువల్ల ఏర్పడే కండరాల బలహీనతను మల్టిపుల్ స్కిర్లోసిస్ అంటారు. దీనికోసం కొపాగ్జోన్ అనే మందును అమెరికాలో ప్రవేశపెట్టేందుకు నాట్కో కొంతకాలం కిందట ఒప్పందాలు చేసుకుంది. అయితే న్యాయపరమైన వివాదాలు ఏర్పడడంతో అప్పీల్ కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం కోర్టు తీర్పు రావడంతో చిక్కులు తొలిగాయి.