: మెంటల్ మ్యాప్ తో ఇల్లు చేరే కపోతాలు
పావురాలను పురాతన కాలంనుంచి సమాచార వాహకాలుగా ఎంత అద్భుతంగా మన పూర్వీకులు వినియోగిస్తూ వచ్చారనే దానిపై రకరకాల కథనాలు ఉన్నాయి. అయితే ఈ పావురాలు వాటిని మనం ఎక్కడ వదిలేసినా కూడా తిరిగి తమ ఇంటికి చేరుకోవడానికి మెంటల్‌మ్యాపింగ్ అనే పద్ధతిని వినియోగిస్తాయని శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తేల్చారు.
పావురాలను గుర్తుతెలియని ప్రదేశంలో విడిచిపెట్టినా కూడా.. వాటి సొంత ఇంటికి అవి దారి తెలుసుకుని వెళ్లిపోగలవుట. ఎంతో పురాతన కాలంనుంచి వర్తమానాలను, లేఖలను పంపేందుకు పూర్వీకులు పావురాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పావురాలు కూడా వలసపక్షుల మాదిరిగానే.. భూమి అయస్కాంత క్షేత్రాన్ని వినియోగించుకుని తమ దారి తెలుసుకుంటాయిట.
జూరిచ్ యూనివర్సిటీలోని బయాలజీ పీహెచ్‌డీ చేస్తున్న నికోల్ బ్లేజర్ ఈ పావురాలపై అధ్యయనాలు చేసి ఈ మేరకు తన సిద్ధాంతాలను రూపొందించారు.