: ఒక మిస్టరీ ముడివిప్పిన నాసా
ఖగోళ జ్ఞానంలో ఇప్పటికి కొన్ని వందల వేల ఏళ్లుగా మిస్టరీలుగానే మిగిలిపోయిన సంగతులు అనేకం ఉంటాయి. అలాంటి వాటిలో సెంచార్లు అనేవి కూడా ఒకటి. కొన్ని ఖగోళ వస్తువులు, బృహస్పతి, నెప్ట్యూన్ గ్రహాల మధ్య ముక్కల్లాగా ఉంటూ ఇతర గ్రహాల్లాగానే సూర్యుడిచుట్టూతా నిత్యం పరిభ్రమిస్తూ ఉంటాయి. అయితే ఈ ఖగోళ శకలాలు ఏమిటి? అనే విషయం ఇన్నేళ్లుగా తేలలేదు. నిజానికి ఇవి సౌరకుటుంబం లోపలి గ్రహాలకు సంబంధించిన శకలాలేనా? లేదా ఇతర సౌరకుటుంబాల నుంచి ఇటువైపు వచ్చిన తోకచుక్కలా? అనే రకరకాల సందేహాలు ఖగోళవేత్తల్లో ఉండేవి.
తాజాగా నాసాకు చెందిన వైడ్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే ఎక్స్‌ప్లోరర్ (వైజ్) ఈ సెంచార్లపై పరిశోధనలు చేసింది. వీటిలో ఎక్కువ శాతం తోకచుక్కలే అని లెక్క తేల్చారు. అవి సౌరకుటుంబం వెలుపలి వైపు నుంచి ఎగిరి వస్తూ ఇక్కడ స్థిరపడ్డాయని వారి అధ్యయనంలో తేల్చారు. నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీకి చెందిన జేవమ్స్ బెవుర్ మాట్లాడుతూ.. ఇప్పుడు శకలాల్లా ఉన్నప్పటికీ గతంలో అవి తోకచుక్కలే అని.. భవిష్యత్తులో మళ్లీ అదే రూపు సంతరించుకుంటాయని అంటున్నారు.