: వాహనానికి వాహనం తగిలిందని కాంగ్రెస్,టీడీపీ మధ్య వివాదం


పంచాయతీ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని విరోధులుగా మారిపోతున్నారు. చాలా గ్రామాల్లో పార్టీలపై ఉన్న అభిమానంతో ఘర్షణలు, దాడులకు పాల్పడుతూ శత్రువులైపోతున్నారు. తాజాగా, గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులో టీడీపీ, కాంగ్రెస్ వర్గీయుల మధ్య చిన్న కారణానికే ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ విజయోత్సవ యాత్రలో కాంగ్రెస్ మద్దతుదారుడి వాహనానికి టీడీపీకి చెందిన వారి వాహనం తగిలిందని వివాదం మొదలైంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News