: వేడెక్కుతున్న ఫిలిం నగర్


గ్రామాల్లో పంచాయతీ వేడి అగ్గిరేపుతుండగా, హైదరాబాద్ నడిబొడ్డునున్న ఫిలిం నగర్ లో ఫిలిం ఛాంబర్ ఎన్నికల వేడి రాజుకుంది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలుగా విడిపోయిన రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరుకు సిద్దమైంది ఫిల్మ్ ఛాంబర్. తమ్మారెడ్డి భరద్వాజ పదవీ కాలం ముగియడంతో ఈ నెల 28న ఛాంబర్ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద నిర్మాతల వర్గం నుంచి సి.కళ్యాణ్, అశోక్ కుమార్ లు బరిలో దిగగా వీరికి అల్లు అరవింద్, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు వంటి బడా నిర్మాతలు మద్దతునిస్తున్నారు. అయితే చిన్ని సినీ నిర్మాతల వర్గం నుంచి దర్శకుడు సాగర్, ప్రసన్న కుమార్ బరిలో నిలబడుతున్నారు. వీరికి దర్శకరత్న దాసరి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

కాగా రెండు వర్గాలు హోరాహోరీ ప్రచారంతో ఫిల్మ్ నగర్ ను హోరెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో చిన్న నిర్మాతలు మద్దతిచ్చిన భరద్వాజ గెలుపొందారు. పెద్ద నిర్మాతలు గెలిస్తే చిన్నసినిమాలకు మనుగడే ఉండదని అంటున్నారు. ఇప్పటికే పెద్ద నిర్మాతలు థియేటర్లను లీజు పేరిట తీసుకుని అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారని, గెలిస్తే మరిన్ని అక్రమాలకు పాల్పడతారని చిన్ననిర్మాతలు మండి పడుతున్నారు.

  • Loading...

More Telugu News