: ఎన్నికల సంఘానికి బాబు లేఖ


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కృష్ణాజిల్లా మూలపాడు ఘటనపై ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను జాబితాలో చేర్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యవహారాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని బాబు తన లేఖలో ఎన్నికల సంఘం కమిషనర్ ను కోరారు. ఈ ఉదయం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో ఒకే ఇంట్లో 250 దొంగ ఓట్లు జాబితాలో చోటు చేసుకోవడం వివాదాస్సదమైంది. టీడీపీ, కాంగ్రెస్ వర్డీయులు బాహాబాహీ తలపడడంతో ఓ దశలో పోలింగ్ నిలిచిపోయింది. టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ పోలింగ్ బూత్ ఎదుట బైఠాయించగా, ఆయనను పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News