: సీఎం నియోజకవర్గంలో బోల్తాపడ్డ 'హస్తం'
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం చిత్తూరు జిల్లా పీలేరులో అధికార కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు సత్తా చాటారు. దీంతో, ఇక్కడ కాంగ్రెస్ వర్గీయులకు నిరాశ తప్పలేదు. తాజా సమాచారం ప్రకారం చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ 134 పంచాయతీలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ కు 41, వైఎస్సార్సీపీకి 99 సర్పంచ్ పదవులు దక్కాయి.