: రఘువీరా నియోజకవర్గంలో దేశం పాగా
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కొందరు రాజకీయ ప్రముఖుల స్వంత నియోజకవర్గాల్లోనే వారికి ఎదురుగాలి వీచింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. అత్యధిక పంచాయతీలను తెలుగుదేశం మద్దతుదారులు కైవసం చేసుకోవడంతో, మంత్రి రఘువీరారెడ్డికి తీవ్ర నిరాశతప్పలేదు. రఘువీరా ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. కందుకూరు, మంత్రి మహీధరరెడ్డి నియోజకవర్గమన్న సంగతి తెలిసిందే.