: జగన్ పార్టీకి ఆ రెండు జిల్లాల్లోనే..
తొలి విడత ఎన్నికల్లో గణనీయ ప్రభావం చూపిన వైఎస్సార్సీపీ రెండో విడత ఎన్నికల్లో కేవలం రెండు జిల్లాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన కడప జిల్లా (65)లోనూ, నెల్లూరు జిల్లా (42)లోనూ ఆ పార్టీ తన పట్టు నిరూపించుకుంది. ఈ రెండు జిల్లాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వైఎస్సార్సీపీ జోరుకు వెనుకంజ వేశాయి. ఇక మిగతా జిల్లాల్లో జగన్ పార్టీ మద్దతుదారులు పెద్దగా ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు.