: పేలుళ్ల మృతులు 16, విషమ పరిస్థితుల్లో 12 మంది


భాగ్యనగరంలో ముష్కరులు బాంబులతో సృష్టించిన మారణ హోమంలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. రాత్రి వరకూ 15 మంది మరణించగా.. ఓమ్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నల్లగొండ జిల్లాకు చెందిన గిరి అనే అతను ఉదయం కన్నుమూశాడు. 

బాంబు పేలుళ్లలో గాయాలపాలై నగరంలోని పలు ఆస్పత్రులలో 117 మంది వరకూ చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మలక్ పేటలోని యశోద ఆస్పత్రిలో ఏడుగురు, నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో ముగ్గురు, దిల్ సుఖ్ నగర్ లోని ఓమ్ని ఆస్పత్రిలో ఇద్దరు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News