: ఆగస్టు 22న హాజరుకండి.. అనిల్ అంబానీకి కోర్టు సమన్లు
2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 22న తమ ఎదుట హాజరుకావాలని సమన్లలో తెలిపింది. ఆయన భార్య టీనా అంబానీని 23న హాజరవ్వాలని పేర్కొంది. అంతకుముందు ఆగస్టు 15న హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో వ్యాపార పనుల కారణంగా ఆ తేదీన హాజరుకాలేనంటూ అంబానీ కోర్టుకు తెలుపుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం తాజా తేదీని ఖరారుచేసింది.