: హస్తం దూకుడు
రెండో విడత పంచాతీయ ఎన్నికల ఫలితాల్లో తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచి అభ్యర్థులు అత్యధిక పంచాయతీల్లో విజయులయ్యారు. ప్రస్తుతానికి 363 పంచాయతీల్లో కాంగ్రెస్, 301 పంచాయతీల్లో టీడీపీ, 202 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ, 49 పంచాయతీల్లో టీఆర్ఎస్, 5 పంచాయతీల్లో వామపక్షాలు, ఇతరులు 314 పంచాయతీల్లో జయభేరి మోగించారు.