: మహిళా ఎంపీపై వ్యాఖ్యలకు దిగ్విజయ్ వివరణ


నిన్న మధ్యప్రదేశ్ లో ర్యాలీ ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మీనాక్షీ నటరాజన్ ను ఉద్దేశించి '100 పర్సెంట్ తంచ్ మాల్' (కత్తిలాంటి సరుకు) అన్న తన మాటలను కొందరు వక్రీకరించడంపై ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎంపీను తాను అగౌరవ పరచలేదని, కేవలం ప్రశంసించానని ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. '100 తంచ్' అంటే 'వందశాతం స్వచ్ఛమైన' అని చెప్పారు. అయితే, ఈ మాటలను మీడియా విపరీత వ్యాఖ్యలుగా పేర్కొని టీఆర్ పీ రేటింగుల కోసం పాకులాడుతోందని విమర్శించారు. అంతేగాక, తను మాట్లాడిన వీడియో స్పీచ్ యూ ట్యూబ్ లింక్ ను కూడా దిగ్విజయ్ పోస్టు చేశారు. అయితే, అటు ఎంపీ నటరాజన్ ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News