: ప్రారంభమైన భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్టు
నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు చెన్నయ్ లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఆసీస్ 13 ఓవర్లలో 56 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 28, ఎడ్ కొవాన్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆరంభంలో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, వికెట్లు పడగొట్టడంలో భారత పేసర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ విఫలమయ్యారు.