: 'అన్నమో రామచంద్రా' అంటున్న ఎన్నికల సిబ్బంది
అనంతపురం జిల్లా బెళగుప్పలో ఎన్నికల సిబ్బందికి ఆకలి బాధ అనుభవంలోకి వచ్చింది. మధ్యాహ్నమవుతున్నా తమకు భోజనాలు రాకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఓట్ల లెక్కింపు చేపట్టబోమంటూ వారు భీష్మించుక్కూచున్నారు. ప్రస్తుతం అధికారులు వారికి నచ్చజెప్పే పనిలో ఉన్నారు.