: పవన్ కల్యాణ్ దాతృత్వం
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ఓ వృద్ధాశ్రమానికి లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఖమ్మం పట్టణ శివార్లలో స్థాపించిన జీసస్ అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకురాలు లక్ష్మి ఇటీవలే హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలిసి తమ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. దీనికి స్పందించిన ఆయన ట్రస్టు పేరిట ఉన్న ఆంధ్రా బ్యాంకు ఖాతాకు లక్ష విరాళం పంపారు.