: మా బాధ్యతలను ఎంపీలకు అప్పగించాం:శైలజానాథ్


ఇప్పటి వరకూ తాము నిర్వర్తించిన సమైక్యాంధ్ర ఉద్యమ బాధ్యతలను ఎంపీలకు అప్పగించామని మంత్రి శైలజానాథ్ తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ త్రికరణ శుద్ధిగా తాను సమైక్యవాదినని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఇప్పటికిప్పుడు కొత్త పరిణామమేదీ ఉత్పన్నం కాలేదని, అలా ఉత్పన్నమైన విషయంపై తన వద్ద సమాచారం లేదని తెలిపారు. ఇప్పటివరకూ తాము నిర్వర్తించిన ఒత్తిడి బాధ్యతలను ఎంపీలపై వదిలామని, వారే అధిష్ఠానంపై ఒత్తిడి పెంచి రాష్ట్రవిభజన జరుగకుండా చూస్తారని అశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News